Sunday, February 2, 2020

సమస్యాపూరణం

సమస్య :-
భార్యయే అత్తఅయ్యె నీవసుధయందు

*తే.గీ**

మరదలన్న చాలా ప్రేమ వరదపొంగె
ఇంటివారిని యెప్పించి జంట జేయ
మేళముల పెళ్లి జరగగా మేనమామ
భార్యయే యత్తయయ్యె నీ వసుధయందు
            ......................✍చక్రి

Saturday, February 1, 2020

సమస్యాపూరణం

సమస్య :-
పాప పాలించె రాజ్యంబు పావనముగ

*తే.గీ**

తల్లిదండ్రుల మాటలు తప్పకుండ
కాననందు వసించిన కరుణ మూర్తి
రావణుని వధించినయోధ్య రాముని కను
పాప పాలించె రాజ్యంబు పావనముగ
             ....................✍చక్రి