Thursday, January 30, 2020

నిషిద్ధాక్షరి

*నిషిద్ధాక్షరి* :-

*స* కార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

*ఆ.వె**

1.

పంటలన్ని పండి పంటచేతికి రాగ
గాదెలన్ని నిండి కలిగెముదము
ముచ్చట గొలిపేటి ముంగిట ముగ్గులు
పల్లె నందు పొంగె పాలపొంగు

2.

భోగి మంటలిచ్చు భోగభాగ్యమ్ములు
పశుల పూజ లిచ్చు పాడిపంట
కొత్త నూపునిచ్చు కోడిపందెమ్ములు
చూడముచ్చటాయె చూచునంత

3.

మకర రాశి లోకి మారునర్కని కక్ష్య
నుత్తరాయణమ్మ కొత్త కాంతి
పుణ్య కాలమనియు పూజ్య భీష్ముండును
వేచిచూచి పలికె వీడుకోలు
            ...............‌‌....✍చక్రి

*మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

No comments:

Post a Comment